'జబర్దస్త్ రోజా' అంటే నేను పిసరంత కూడా ఫీల్ కాను: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జబర్దస్త్ రోజా' అంటే నేను పిసరంత కూడా ఫీల్ కాను: రోజా

  • తెలుగు లోగిళ్లలోకి చేరిపోయిన కార్యక్రమం అది
  • నవ్వులు పంచుతూ ఆరోగ్యాన్ని అందిస్తోంది
  • ఐదేళ్ల నుంచి సాగుతున్నదంటే మాటలు కాదు
  • వైఎస్ఆర్ పార్టీ మహిళా నేత రోజా
వందలాది సినిమాల్లో నటించి, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితురాలైన తనను కొంతమంది 'జబర్దస్త్ రోజా' అని పిలుస్తుండటంపై రోజా స్పందించారు. అలా పిలిచినందువల్ల తాను పిసరంత కూడా ఫీల్ కావడం లేదని చెప్పారు. జబర్దస్త్ కారణంగా, తనకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబంలోను బంధువులు దొరికారని అన్నారు.

ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా మాట్లాడుతూ, ఎన్నో కుటుంబాలకు నవ్వులను అందిస్తూ, వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్యక్రమం జబర్దస్త్ అని, ఐదేళ్ల నుంచి ఓ కార్యక్రమం నడుస్తూ ఉన్నదంటే, అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదని అన్నారు. 'రచ్చబండ' కార్యక్రమం వదులుకోవడానికి కారణాలను చెబుతూ, అది వారంలో ఆరు రోజులు వస్తుంటుందని, దీని కారణంగా తాను సమయాన్ని కేటాయించలేక పోతున్నానని, అందువల్లే దాన్ని వదులుకున్నానని అన్నారు. ఆ షోను తిరిగి మరోసారి చేయాలని తాను ఎక్కడికి వెళుతున్నా అడుగుతున్నారని చెప్పారు. తన వల్ల కొన్ని కుటుంబాలు మళ్లీ ఒక్కటయ్యాయని, అది తనకెంతో గర్వకారణమని రోజా తెలిపారు. తనపై వచ్చే కామెంట్లన్నీ జలసీతో వచ్చేవేనని, ఏమీ చేయలేక అనే ఇటువంటి మాటలను పట్టించుకోబోనని అన్నారు.
roja
jabardash

More Telugu News