panner selvam: తమిళనాట ఆసక్తి... ఆకుపచ్చ స్థానంలో 'కాషాయం' చేర్చుకున్న పన్నీర్ సెల్వం బ్యాచ్!

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా అన్నాడీఎంకే పోస్టర్లంటే ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తాయి. అటువంటిది ఒక్కసారిగా ఆ పార్టీ పోస్టర్ల రంగు ఆకుపచ్చ నుంచి కాషాయానికి మారింది. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం పెడుతున్న పోస్టర్లలో కాషాయం రంగు వచ్చి చేరింది. ఈ మార్పును రాజకీయ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

గత కొంత కాలంగా పన్నీర్ సెల్వం బీజేపీకి దగ్గరవుతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జయలలిత మరణం తరువాత, పన్నీర్ సెల్వం స్వయంగా పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు సైతం జరిపారు. అంతకుముందు ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడూ తాత్కాలిక ముఖ్యమంత్రి హోదాలో పర్యటనలు జరిపారు. పన్నీర్ సెల్వంకు మద్దతు పలకడం ద్వారా తమిళనాడులో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని బీజేపీ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా పోస్టర్ల రంగు మార్పు పరిణామం మరెక్కడికి వెళుతుందో వేచి చూడాలి.
Go Back to Shorts
panner selvam
tamilnadu
bjp
modi

More Telugu News