kathi mahesh: ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన సినిమాలు ఇవే : కత్తి మహేశ్

షార్ట్స్‌లో చూడండి
సినిమా జర్నలిస్ట్ గా కత్తి మహేశ్ తన అభిప్రాయాలను కచ్చితంగా చెప్పేస్తుంటారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి మొహమాటాలకుపోరు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమాలకి సంబంధించిన కొన్ని ప్రశ్నలకి సమాధానమిచ్చారు. ఈ మధ్య కాలంలో తనకి బాగా నచ్చిన సినిమా 'కంచె' అని అన్నారు.

చాలా కష్టతరమైన ఒక కాన్సెప్ట్ ను తీసుకుని చాలా సింపుల్ గా ..  ప్రేక్షకులకు అర్థమయ్యేలా .. వాళ్లు అంగీకరించేలా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన తీరు అభినందనీయమని చెప్పారు. రీసెంట్ గా వచ్చిన 'మహానుభావుడు' కథను దర్శకుడు మారుతి చాలా అందంగా .. ఆహ్లాదంగా చెప్పాడని అన్నారు. క్రిష్ .. ఇంద్రగంటి మోహనకృష్ణ .. ప్రవీణ్ సత్తారు .. అవసరాల శ్రీనివాస్ .. తరుణ్ భాస్కర్ సినిమాలు ఎక్కువగా నచ్చుతాయని చెప్పారు.       
Go Back to Shorts
kathi mahesh

More Telugu News