ఒక్క బంతి వేయడానికి ఐదుసార్లు ప్రయత్నించిన పాక్ పేసర్ వాహెబ్ రియాజ్!
- క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన!
- ఒక్క బాల్ వేసేందుకు ఐదు నిమిషాలకు పైగా తీసుకున్న బౌలర్
- ఆగ్రహం వ్యక్తం చేసిన పాక్ కోచ్ మైక్ అర్థర్
బంతి వేసేందుకు పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలో రిథమ్ తప్పడంతో మరోసారి ప్రయత్నించాడు. ఇలా మొత్తం ఐదుసార్లు బంతిని పట్టుకుని పరిగెత్తడంతో క్రీజులో ఉన్న శ్రీలంక బ్యాట్స్‌మన్ దిముత్ కరుణరత్నె విసుగుచెందడం కనిపించింది. రియాజ్ తీరుపై పాక్ కోచ్ మైక్ మిక్కీ అర్థర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.