నష్టాలు భరించలేం.. అమెరికాకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాం: పాకిస్థాన్ ఎయిర్ లైన్స్
- ఈ సర్వీసుల వల్ల ఏటా రూ. 125 కోట్ల నష్టం
- నష్టాలు భరించలేకే తుది నిర్ణయం
- 1961 నుంచి అమెరికాకు సర్వీసులను నడుపుతున్న పాకిస్థాన్ ఎయిర్ లైన్స్
నష్టాలు భరించలేనంతగా తయారయ్యాయని... మరో దారి లేకే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. 1961లో అమెరికాకు సర్వీసులను ఈ సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతానికి న్యూయార్క్ తో పాటు అమెరికాలోని మరో మూడు నగరాలకు సర్వీసులను నడుపుతోంది. గతంలోనే అమెరికాకు సర్వీసులను నిలిపివేయాలని ఈ సంస్థ పలుమార్లు ప్రయత్నించింది. అయితే, రాజకీయ ఒత్తిడి వల్ల నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.