తెలుగులో మెహ్రీన్ జెండా పాతేయడం ఖాయం!: రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులో మెహ్రీన్ జెండా పాతేయడం ఖాయం!: రవితేజ

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్'
  • తన పాత్ర పట్ల రవితేజ సంతృప్తి 
  • మెహ్రీన్ హవా మొదలైనట్టే
  • ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయం    
కొంత గ్యాప్ తరువాత రవితేజ చేసిన 'రాజా ది గ్రేట్' .. ఈ నెల 19వ తేదీన భారీ స్థాయిలో థియేటర్స్ కి రానుంది. చూపులేని వ్యక్తిగా రవితేజ కనిపించే ఈ సినిమాలో, కథానాయికగా మెహ్రీన్ అలరించనుంది. తాజాగా ఈ సినిమాను గురించి రవితేజ మాట్లాడుతూ .. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని అన్నారు.

ఈ సినిమా ద్వారా రాజేంద్ర ప్రసాద్ .. రాధిక వంటి సీనియర్స్ తో నటించే అవకాశం దక్కడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. మెహ్రీన్ అంకితభావం చూస్తే తనకి చాలా ఆశ్చర్యం వేసేసిందనీ, మరో రెండు సినిమాలు చేసే సరికి ఆమె పూర్తిగా తెలుగు నేర్చేసుకోవడం ఖాయమని అన్నారు. గ్లామర్ తో పాటు మంచి నటనా సామర్థ్యం వున్న మెహ్రీన్, తెలుగులో జెండా పాతేయడం ఖాయమని చెప్పారు. దిల్ రాజు చెప్పినట్టుగా ఈ సినిమా తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.   
raviteja
mehreen

More Telugu News