లాస్ వెగాస్ ఘ‌ట‌న‌లో బుల్లెట్ గాయంతో భ‌ర్త‌కు మెసేజ్ చేసిన భార్య‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లాస్ వెగాస్ ఘ‌ట‌న‌లో బుల్లెట్ గాయంతో భ‌ర్త‌కు మెసేజ్ చేసిన భార్య‌

  • `ఐ ల‌వ్ యూ... నాకు బుల్లెట్ త‌గిలింది` అని మెసేజ్‌
  • క‌డుపులో త‌గిలిన బుల్లెట్‌
  • ప్ర‌స్తుతం క్షేమంగా ఉన్న మ‌హిళ‌
లాస్ వెగాస్‌లో సంగీత క‌చేరీని ఆస్వాదిస్తున్న వారిపై స్టీఫెన్ పెడ్డాక్ జరిపిన కాల్పుల్లో ఓ మ‌హిళ‌కు బుల్లెట్ త‌గిలింది. అయిన‌ప్ప‌టికీ తాను అధైర్య‌ప‌డ‌కుండా ఆ విషయాన్ని తన భ‌ర్త‌కు మెసేజ్ చేసింది. కెన‌డాకు చెందిన జోసెఫ్ లాంబోర్న్ భార్య జేన్, త‌న స్నేహితురాలు జోడీ ఆన్సెల్‌తో క‌లిసి సేదదీర‌డం కోసం లాస్ వెగాస్ వెళ్లింది. అలాగే అక్క‌డ జ‌రుగుతున్న క‌చేరీకి కూడా హాజ‌రైంది. ఆదివారం రాత్రి తాను ప‌నిలో ఉండ‌గా అక్క‌డ జ‌రిగిన కాల్పుల్లో జేన్ గాయ‌ప‌డిన‌ట్లు జోసెఫ్‌కి లాస్‌వెగాస్‌లో ఉండే ఆమె బంధువులు చెప్పారు.

ఈలోగా, తన ప్రాణానికి ఏదైనా ప్ర‌మాదం జ‌రుగుతుందేమో అనుకుని జేన్ వెంట‌నే త‌న భ‌ర్త‌కి త‌న ప్రేమ‌ను తెలియ‌జేస్తూ మెసేజ్ చేసింది. త‌ర్వాత మీడియాతో మాట్లాడిన జోసెఫ్ ఆ మెసేజ్‌ను చూపించాడు. బుల్లెట్ క‌డుపులో త‌గిలినందువ‌ల్ల మొద‌ట్లో ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విషమంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పార‌ని, ప్ర‌స్తుతం ఆమె క్షేమంగా ఉంద‌ని వెల్ల‌డించార‌ని జోసెఫ్ తెలిపాడు.
las vegas
shootings
canada
joseph
jan
jody
message
stephen paddock

More Telugu News