ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పకుండా.. పోలీసులకు చుక్కలు చూపుతున్న హనీప్రీత్!
- ప్రతి ప్రశ్నకూ తెలియదనే సమాధానం
- కేసులెందుకు పెట్టారని పోలీసులకే హనీప్రీత్ ఎదురు ప్రశ్నలు
- నేడు కూడా కొనసాగనున్న విచారణ
ప్రతి ప్రశ్నకూ ఆమె నుంచి 'నాకు తెలియదు, లేదు, కాదు' అన్న సమాధానాలే వస్తున్నాయని చెబుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి దాదాపు నాలుగైదు గంటల విచారణ తరువాత, ఈ ఉదయం తిరిగి విచారణ ప్రారంభమైంది. హనీప్రీత్ విచారణకు సహకరించడం లేదని, తనపై ఆరోపణలు తప్పుడువని ఆమె చెబుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారని హనీప్రీత్ ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. ఇక నిజాలను కక్కించేందుకు తమ వద్ద ఉన్న ఆధారాలను ఆమె ముందు నేడు బయట పెట్టనున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, విచారణ జరుగుతున్న ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.