vijay: విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తా: ఎస్.జే. సూర్య

షార్ట్స్‌లో చూడండి
ఇళయదళపతి విజయ్‌ తమిళనాడు ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తానని ప్రముఖ దర్శక, నటుడు ఎస్‌.జే. సూర్య వ్యాఖ్యానించాడు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, సినీ నటులు రాజకీయాల్లోకి రాకూడదన్న చట్టం లేదన్నారు. అలాగే ఫలానా వ్యక్తి మాత్రమే రాజకీయాల్లో అడుగుపెట్టాలనే నిర్బంధం కూడా లేదని గుర్తు చేశాడు. స్వతంత్ర భారతావనిలో సమాజానికి మంచి చేయాలనుకొనే ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావచ్చని స్పష్టం చేశాడు.

సినీ నటులు రాజకీయాల్లోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నాడు. అయితే, రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తికి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండాలని ఆయన సూచించాడు. ఇచ్చిన పనిని విజయ్ ఏకాగ్రత, నిబద్ధతతో చక్కబెట్టే వ్యక్తి అని చెప్పాడు. తనకు విజయ్ స్నేహితుడిని చెప్పిన సూర్య, ఆయన ముఖ్యమంత్రి అయితే చాలా సంతోషిస్తానని అన్నాడు. కాగా, మహేష్‌ బాబు ‘స్పైడర్‌’లో ఎస్‌జే సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించి, ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న విజయ్‌ ‘మెర్సల్‌’ (అదిరింది)లో కూడా ఆయనే విలన్‌ కావడం విశేషం. 
Go Back to Shorts
vijay
s.j.surya
mersel
comments

More Telugu News