'అల్లావుద్దీన్ ఖిల్జీ' ఇలా ఉంటాడని ఫోటో పెట్టిన సంజయ్ లీలా భన్సాలీ!
- భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ
- ఇప్పటికే పద్మావతి, మహారావల్ రతన్ సింగ్ లుక్స్ రివీల్ చేసిన భన్సాలీ
- అల్లావుద్దీన్ ఖల్జీగా ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న రణ్ వీర్ సింగ్
తరువాత ఆమె భర్త 'మహారావల్ రతన్ సింగ్' గా నటించిన షాహిద్ కపూర్ లుక్ ను విడుదల చేశాడు. తాజాగా, అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అల్లావుద్దిన్ ఖిల్జీ’ పాత్రను రివీల్ చేశాడు. ఈ సినిమాలో కీలకమైన ‘అల్లావుద్దీన్ ఖిల్జీ’ ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో రణ్ వీర్ సింగ్ పొడవాటి కేశాలు, కంటి కింద గాటుతో అదిరిపోయాడని అభిమానులు పేర్కొంటున్నారు. విడుదలైన కాసేపటికే ఇది ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.