భారీ వర్షం... హెలికాఫ్టర్‌లో ఇబ్బంది ప‌డ్డ మంత్రి హ‌రీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ వర్షం... హెలికాఫ్టర్‌లో ఇబ్బంది ప‌డ్డ మంత్రి హ‌రీశ్ రావు

  • హెలికాఫ్టర్‌లో ఖమ్మం వెళ్లి తిరిగి హైదరాబాద్ వచ్చిన హరీశ్ రావు
  • భారీ వర్షం కారణంగా బేగంపేటలో ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వని అధికారులు
  • చాలాసేపు గాల్లో చక్కర్లు.. చివరకు హకీంపేటలో ల్యాండ్
తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు హెలికాఫ్టర్‌లో కాసేపు ఇబ్బంది ప‌డ్డారు. ఖమ్మంలో పర్యటించేందుకు హరీశ్‌రావు ఈ రోజు ఉదయం హెలికాప్టర్‌లో వెళ్లారు. కాసేప‌టి క్రితం తిరిగి అదే హెలికాఫ్ట‌ర్‌లో హైద‌రాబాద్ కు వ‌చ్చారు. అయితే, న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురుస్తోన్న విష‌యం తెలిసిందే. దీంతో బేగంపేట విమానాశ్రయ అధికారులు ఆయ‌న హెలికాఫ్ట‌ర్‌ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. ప్ర‌తికూల‌ వాతావరణం కూడా ఉండ‌డంతో గాల్లోనే ఆ హెలికాఫ్ట‌ర్‌ చాలాసేపు చక్కర్లు కొట్టింది. ఆ హెలికాఫ్ట‌ర్‌ని చివ‌ర‌కు పైలట్ న‌గ‌రంలోని హకీంపేటలో ల్యాండ్ చేశాడు.
harish rao

More Telugu News