పెళ్లి కొడుకును చేస్తున్న వేళ, శ్రీరామ్ ను చూసి ఉద్వేగానికి గురైన పరిటాల సునీత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి కొడుకును చేస్తున్న వేళ, శ్రీరామ్ ను చూసి ఉద్వేగానికి గురైన పరిటాల సునీత!

  • వైభవంగా సాగుతున్న వివాహం
  • సంప్రదాయానికి అనుగుణంగా ఐదు రోజుల పెళ్లి
  • పది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు
  • వీఐపీలను ఆత్మీయంగా పలకరిస్తున్న సునీత
తన కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహాన్ని వైభవంగా జరిపిస్తున్న ఏపీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్ ను పెళ్లి కొడుకుగా చూసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఓ ఇంటి వాడు కాబోతున్న కుమారుడిని చూసి ఆమె కళ్లు ఆనందంతో చమర్చాయి. నేడు శ్రీరామ్ వివాహం, జ్ఞానతో వెంకటాపురంలో వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

అభిమానుల గుండెల్లో రవన్నగా మిగిలిపోయిన పరిటాల రవి లేని లోటు కనిపిస్తోందని, ఈ సమయంలో ఆయన ఉంటే ఎంతో బాగుండేదని ఈ సందర్భంగా సునీత, తన బంధువుల వద్ద వ్యాఖ్యానించారు. సంప్రదాయానికి అనుగుణంగా ఐదు రోజుల పాటు వివాహం జరుగనుండగా, పరిటాల బంధువులు, ముఖ్యమైన అనుచరులు పది రోజుల ముందే వెంకటాపురం చేరుకుని ఏర్పాట్లు చేశారు.

ఇక సునీత, ఎన్నడూ లేనంత ఆనందంగా కనిపిస్తున్నారు. వచ్చిన వారిని, ముఖ్యంగా వీఐపీలను ఆమె పేరు పేరునా పలకరిస్తున్నారు. తమ నేత కుమారుడైన శ్రీరామ్ వివాహాన్ని వైభవంగా జరిపించేందుకు పలు గ్రామల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం, ప్రజల్లో పరిటాల రవికి ఉన్న గుర్తింపును తెలియజేస్తోంది. నేడు రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికార, అనధికార ప్రముఖులు వివాహ వేడుకకు హాజరు కానున్నారు.
paritala sriram
paritala ravi
chandrababu
kcr

More Telugu News