బుల్లెట్ రైలు అందరినీ చంపుకుంటూ పోతుంది: చిదంబరం
- బుల్లెట్ రైలు ముఖ్యం కాదు
- భద్రత, మెరుగైన సదుపాయాలే ముఖ్యం
- ఇవి సామాన్యులు ప్రయాణించే రైళ్లు కావు
- ఈ ప్రాజెక్టు మరో నోట్ల రద్దు కార్యక్రమం లాంటిది
బుల్లెట్ రైలుపై కాకుండా భద్రత, మెరుగైన సదుపాయాలపై రైల్వే శాఖ దృష్టిసారించాలని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయనుండటంపై చిదంబరం మండిపడ్డారు. బుల్లెట్ రైళ్లలో సామాన్యులు ప్రయాణించలేరని... కేవలం డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లు మాత్రమే ప్రయాణించగలరని అన్నారు. ట్విట్టర్ వేదికగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.