ఒసామా బిన్‌లాడెన్ జీవిత క‌థ‌తో సినిమా... ద‌ర్శ‌కుడు విశాల్ భ‌రద్వాజ్‌!

అమెరికాను గ‌డ‌గ‌డ‌లాడించి, త‌ర్వాత ఆ దేశం చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన ఉగ్ర‌వాది ఒసామా బిన్‌లాడెన్ జీవితక‌థ ఆధారంగా త్వ‌ర‌లో ఓ సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఎక్కువ‌గా న‌వ‌లల ఆధారంగా సినిమాలు తెర‌కెక్కించే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు విశాల్ భ‌రద్వాజ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్న‌ట్లు స‌మాచారం. పాకిస్థాన్‌లో ఒసామాను మ‌ట్టుబెట్టిన `అబోట్టాబాద్` ప్రాంతం పేరునే ఈ సినిమాకు టైటిల్‌గా పెట్ట‌నున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాల కథనం.

కేథరీన్‌ స్కాట్‌, క్లార్క్‌, ఆడ్రియన్‌ లివై రాసిన ‘ది ఎక్సైల్‌’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత షేక్‌స్పియర్ రాసిన మ్యాక్‌బెత్‌, ఓథెల్లో, హ్యామ్లెట్‌ నవలలను విశాల్ భ‌ర‌ద్వాజ్ మక్బూల్‌, ఓంకారా, హైదర్ సినిమాలుగా తెరకెక్కించిన సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
osama bin laden
biopic
vishal bharadwaj
abottabad
pakistan

More Telugu News