bobby: 'జై లవ కుశ' కథ ముందుగా రవితేజకు వినిపించాననడంలో నిజం లేదు: బాబీ

షార్ట్స్‌లో చూడండి
దర్శకుడు బాబీ 'సర్దార్ గబ్బర్ సింగ్' తరువాత రవితేజతో ఒక సినిమా చేయాలనుకున్నాడు. రవితేజను కలిసి ఒక కథను వినిపించాడు. అదే సమయంలో ఆయన ఎన్టీఆర్ ను కలుసుకోవడం .. 'జై లవ కుశ' కథను ఓకే చేయించుకోవడం జరిగింది. దాంతో రవితేజకు వినిపించిన కథనే ఎన్టీఆర్ తో ఓకే చేయించుకున్నాడనే ప్రచారం జరిగింది.

ఆ విషయాన్ని గురించి తాజాగా బాబీ స్పందించాడు. తాను రవితేజకు వినిపించింది 'జై లవ కుశ' కథ కాదని ఆయన స్పష్టం చేశాడు. రవితేజ కోసం తాను సిద్ధం చేసిన కథ వేరే ఉందనీ, త్వరలోనే ఆయనతో ఆ సినిమా చేస్తానని చెప్పాడు. ఇక 'జై లవ కుశ' కంటే ముందుగానే తాను ఎన్టీఆర్ కోసం ఒక కథను రెడీ చేసుకున్నాననీ, ఎన్టీఆర్ కి కుదిరినప్పుడు ఆయనతోనే ఆ సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బాబీ నెక్స్ట్ మూవీ రవితేజతో ఉంటుందన్నమాట.     
Go Back to Shorts
bobby

More Telugu News