పాకిస్థాన్ నటితో రణ్ బీర్ ప్రేమాయణం... సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్ నటితో రణ్ బీర్ ప్రేమాయణం... సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో

  • మహిరా ఖాన్ తో రణ్ బీర్ కపూర్ డేటింగ్?
  • న్యూయార్క్ హోటల్ లో దిగిన రణ్ బీర్, మహిరా
  • హోటల్ రూంలో సిగిరెట్లు తాగుతూ కెమెరా కంట
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
  • డేటింగ్ లాంటిదేమీ లేదన్న రణ్ బీర్
పాకిస్తాన్ నటితో బాలీవుడ్ యువ నటుడు రణ్ బీర్ కపూర్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కత్రినా కైఫ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్లి వరకు వెళ్లి, బ్రేకప్ అయిన రణ్ బీర్ కపూర్, తాజాగా షారూఖ్ 'రయీస్' హీరోయిన్, పాక్ నటి మహిరా ఖాన్ తో ప్రేమాయణంలో మునిగి తేలుతున్నాడని బాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వారిద్దరూ న్యూయార్క్ లోని ఒక హోటల్ లో సిగిరెట్ తాగుతున్న సందర్భంలో తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, అందుకే హోటల్ లోని ఒకే రూంలో దిగి, రిలాక్స్ అవుతున్నారని బాలీవుడ్ లో కథనాలు వెల్లువెత్తాయి. దీనిపై రణ్ బీర్ కపూర్ స్పదించాడు. డేటింగ్ వార్తలు అబద్ధమని తేల్చి చెప్పాడు. సినిమా షూటింగ్ లో భాగంగా న్యూయార్క్ వెళ్లామని తెలిపాడు. ఒకే హోటల్ లో దిగడంతో కలిసి సిగిరెట్ తాగామని, అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశాడు. 
ranbir kapoor
mahira khan
newyork
dating
smoking

More Telugu News