సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • ఖాళీ సమయాల్లో నిద్రపోతానంటున్న తమన్నా
  • బ్లూస్కై చేతిలో పవన్ తాజా చిత్రం హక్కులు 
  • 'భారతీయుడు' సీక్వెల్ సన్నాహాలు  
*  ఖాళీ దొరికితే కనుక తాను హాయిగా నిద్రపోతానని చెబుతోంది మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా. "షూటింగ్ లేనప్పుడు మంచం మీద నుంచి దిగను. ఎంతసేపైనా హాయిగా పడుకుంటా. అలాగే, ఒంటరిగా కూర్చుని ఏదో ఒకటి ఆలోచిస్తూ రిలాక్స్ అవుతాను. దీని వల్ల ఎనర్జీ రీచార్జ్ అయినట్టుగా అనిపిస్తుంది" అని చెప్పింది.    
*  విదేశాల్లో పలు తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్న బ్లూ స్కై సినిమాస్ సంస్థ తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం పంపిణీ హక్కులను కూడా సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నటి ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తోంది.
*  రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ చేయడానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కమలహాసన్, దర్శకుడు శంకర్ కలసి ఈ చిత్రంపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. నేటి అవినీతి వ్యవస్థపై పోరాటంగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.     
Thamanna
kamal

More Telugu News