మ‌లాలాను క‌లిసిన ప్రియాంక చోప్రా... ట్విట్ట‌ర్‌లో ఒక‌రిని ఒక‌రు పొగిడేసుకున్న వైనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌లాలాను క‌లిసిన ప్రియాంక చోప్రా... ట్విట్ట‌ర్‌లో ఒక‌రిని ఒక‌రు పొగిడేసుకున్న వైనం

యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా బాలిక‌ల విద్య కోసం గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా త‌న వంతు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవ‌ల న్యూయార్క్‌లో జ‌రిగిన యునిసెఫ్ స‌మావేశంలో ఆమె పాల్గొంది. అదే స‌మావేశానికి బాలికా విద్య కోసం పాటుప‌డుతూ నోబెల్ బ‌హుమ‌తి గెల్చుకున్న మ‌లాలా యూసుఫ్ జాయ్ కూడా హాజ‌రైంది. వీరిద్ద‌రూ క‌లుసుకోవ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డంతో ఇద్దరూ చాలా ఎగ్జయిట్ అయ్యారు. త‌ర్వాత ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ అనుభూతుల‌ను పంచుకున్నారు.

`ప్రియాంక చోప్రాను క‌లిసిన విష‌యాన్ని నేను న‌మ్మ‌లేక‌పోతున్నా!` అంటూ మ‌లాలా ట్వీట్ చేయ‌గా, `న‌న్ను క‌ల‌వ‌డం కాదు... నేను నిన్ను క‌లిశానంటే నాక్కూడా న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదు. చిన్న వ‌య‌సులో పెద్ద హృద‌యం, గొప్ప ఘ‌న‌త‌లు సాధించిన నిన్ను చూస్తే గ‌ర్వంగా ఉంది` అంటూ ప్రియాంక ట్వీట్ చేసింది. అలాగే ఈ స‌మావేశంలో చ‌ర్చించిన కొన్ని ప్ర‌ధాన అంశాల‌ను కూడా ప్రియాంక ట్వీట్ చేసింది.
malala
priyanka chopra
unicef
meeting
twitter
goodwill ambassador
girl education

More Telugu News