మంత్రాలయంలో అగ్ని ప్రమాదం!

 

కర్నూలు జిల్లా మంత్రాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ మంటలు ఆరు దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదస్థలిని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు పరిశీలించారు. నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Go Back to Shorts
fire accident in mantralayam
mantralayam
fire accident

More Telugu News