వేషం మార్చి.. ఖాట్మాండూలో తిరుగుతున్న హనీ ప్రీత్!
- హనీ ప్రీత్ తో పాటు ముగ్గురు లేదా నలుగురు అనుచరులు
- సాధారణ ప్రైవేటు ట్యాక్సీల్లో ప్రయాణాలు చేస్తున్న హనీ ప్రీత్
- ఖాట్మాండూలో సెప్టెంబర్ 2న కనిపించిన హనీ ప్రీత్
దీంతో వారు నేపాల్ లోని తమ సోర్స్ తో కనెక్ట్ అయి, ఆమె ఫోటోలు పంపారు. వెంటనే రంగంలోకి దిగిన సోర్స్.. ఆమె ఆచూకీని గుర్తించినట్టు తేలింది. సెప్టెంబర్ 2న నేపాల్ రాజధాని ఖాట్మాండూలో హనీప్రీత్ కనిపించిందని నిర్ధారణ అయింది. ఆమెతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, వారంతా ఆమెను సురక్షిత ప్రాంతంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది.
పోలీసు, నిఘా వర్గాలకు చిక్కకుండా ఉండేందుకు హనీ ప్రీత్ తన గెటప్ ను పూర్తిగా మార్చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె తన ప్రయాణాలను గతంలోలా లగ్జరీ వాహనాల ద్వారా కాకుండా సాధారణ, ప్రైవేటు ట్యాక్సీలలో చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆమెను పట్టుకునేందుకు పోలీసులు పకడ్బందీ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.