రాజకీయాల్లోకి నేనూ వస్తున్నా!: విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజకీయాల్లోకి నేనూ వస్తున్నా!: విశాల్

  •  తుప్పారివాలన్'తో హిట్ అందుకున్న విశాల్
  •  తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కీలక నిర్ణయాలు
  •  సేవా కార్యక్రమాల్లోను ముందుండే తీరు
  •  రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి  

       

ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూ వెళ్లడమే కాకుండా, మరో వైపున సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా విశాల్ చురుకుగా పాల్గొంటూ ఉంటాడు. 'దేవి ట్రస్ట్' ద్వారా ఆయన చాలాకాలంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం 'తుప్పారివాలన్' హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంలోనే .. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలను చేపడుతున్నారా? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అయితే, మనసులో ఏదో పెట్టుకుని ఏదో చేయడం తనకి అలవాటు లేదని విశాల్ అన్నాడు. అధికారమనేది వుంటే ప్రజలకు మరింత మంచి చేయవచ్చనీ .. మంచి చేయడమే రాజకీయమైతే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేశాడు. త్వరలోనే విశాల్ కూడా రంగంలోకి దిగుతాడన్న మాట.       
vishal

More Telugu News