kakinada: కాకినాడలో సుంకరి పావనిని వరించిన అదృష్టం... మేయర్ పీఠంపై తొలిసారి!

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల ఎన్నికలు జరిగిన కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా సుంకర పావనిని ఎంపిక చేసినట్టు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. బీజేపీ కౌన్సిలర్లు, ఆ పార్టీ నేతలు సహా అందరి అభిప్రాయాలను తీసుకుని యువకురాలు, మంచి ఉన్నత విద్యను అభ్యసించిన పావనిని ఈ పదవికి ఎంపిక చేశామని అన్నారు. డిప్యూటీ మేయర్ గా కాలా సత్తిబాబును ఎంపిక చేశామని, ఈ ఎంపిక పూర్తిగా సీఎం చంద్రబాబునాయుడు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాగిందని, ఎవరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని తెలిపారు.

ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ, తనకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడిచి, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనకు తొలిసారిగా మేయర్ పీఠంపై కూర్చునే అవకాశం లభించిందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు. ఇప్పటివరకూ తాను గృహిణిగా ఉండి, ఇంటిని చక్కదిద్దుకున్నానని, ఇకపై నగరాభివృద్ధిపై దృష్టిని సారిస్తానని చెప్పారు. 
Go Back to Shorts
kakinada
sunkara pavani
kala tattibabu

More Telugu News