పూరీ దర్శకత్వంలోను చేయనున్న రవితేజ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పూరీ దర్శకత్వంలోను చేయనున్న రవితేజ!

  • ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోన్న రవితేజ 
  •  సరైన హిట్ కోసం సీనియర్ దర్శకులపై దృష్టి
  •  శ్రీను వైట్ల .. వినాయక్ లకు గ్రీన్ సిగ్నల్ 
  •  పూరీతోను చేయడానికి రెడీ


ప్రస్తుతం రవితేజ రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటైన 'రాజా ది గ్రేట్' అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల కాలంలో రవితేజకి చెప్పుకోదగిన హిట్ లేదు. దాంతో ఆయన గతంలో తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో కలిసి మళ్లీ పనిచేయాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే శ్రీను వైట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'నీ కోసం' .. 'వెంకీ' .. 'దుబాయ్ శీను' వంటి హిట్స్ వచ్చాయి.

 ఇక వినాయక్ తోను రవితేజ ఒక సినిమా చేయనున్నాడనే వార్త బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి చేసిన 'కృష్ణ' హిట్ చిత్రాల జాబితాలో చేరింది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయడానికి రవితేజ ఇంట్రెస్ట్ చూపుతున్నాడనేది తాజా సమాచారం. గతంలో ఈ కాంబినేషన్లో ' నేనింతే' .. 'ఇడియట్' .. 'అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి' .. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' వంటి హిట్స్ వచ్చాయి. ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ కలిసి పనిచేయబోతుందన్న మాట.    
raviteja
puri

More Telugu News