సైలెంట్ గా మరో సినిమా చేసేస్తోన్న అనసూయ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైలెంట్ గా మరో సినిమా చేసేస్తోన్న అనసూయ!

బుల్లితెరపై సందడి చేసే అనసూయకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒక వైపున టీవీ ప్రోగ్రామ్స్ తోను .. మరో వైపున సినిమా ఫంక్షన్స్ తోను ఫుల్ బిజీగా వుండే అనసూయ, నచ్చిన పాత్ర దొరికితే చాలు వెండితెరపైకి వచ్చేస్తూ ఉంటుంది. తన పేరుతో సినిమాల్లో పాటలు పెట్టేంత క్రేజ్ తెచ్చుకున్న అనసూయ, సైలెంట్ గా మరో సినిమా చేసేస్తోందనేది తాజా సమాచారం.

 అనసూయ లీడ్ రోల్ చేస్తోన్న ఈ సినిమాలో, శ్రీనివాస రెడ్డి .. శివారెడ్డి .. షకలక శంకర్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకి 'సచ్చిందిరా గొర్రె' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ కామెడీ థ్రిల్లర్ ద్వారా శ్రీధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది.     
anasuya

More Telugu News