'బిచ్చగాడు' కన్నడ రీమేక్ లో విజయ్ దేవరకొండ?
Add ap7am to your home Screen

'బిచ్చగాడు' కన్నడ రీమేక్ లో విజయ్ దేవరకొండ?

'పెళ్లి చూపులు' సినిమాతో తనకి వచ్చిన క్రేజ్ ను 'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండ అమాంతంగా పెంచేసుకున్నాడు. ప్రస్తుతం అయన చేతిలో అరడజను తెలుగు సినిమాలు వున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే ఆయనకి రెండేళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కన్నడలో ఒక సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

 విజయ్ ఆంటోని కథానాయకుడిగా తమిళంలో చేసిన 'పిచ్చాయ్ క్కారన్' .. తెలుగులో 'బిచ్చగాడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయాలనుకున్న ఓ నిర్మాత, విజయ్ దేవరకొండను సంప్రదించినట్టు సమాచారం. ఈ రీమేక్ చేయడానికి విజయ్ దేవరకొండ అంగీకరించినట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి.       
vijay devarakonda

More Telugu News