బన్నీ స్పీడ్ మాములుగా లేదు .. దసరాకే ఫస్టులుక్!
ఈ నేపథ్యంలో దసరాకి ఫస్టులుక్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ మరింత ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. ఆయన జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. దర్శకుడిగా ఇది తనకి తొలి చిత్రం కావడంతో, తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వక్కంతం వంశీ వున్నాడు.