'మహానటి' సినిమా కోసం సావిత్రి తనయుడిని కలిసిన నాగ్ అశ్విన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానటి' సినిమా కోసం సావిత్రి తనయుడిని కలిసిన నాగ్ అశ్విన్!

సినీ రంగంలోను .. వైవాహిక జీవితంలోను సావిత్రి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆమె జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులున్నాయి. అలాంటి సావిత్రి జీవిత చరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి అవసరమైన కొంత ముఖ్యమైన సమాచారం కోసం ఆయన, అమెరికాలో ఉంటోన్న సావిత్రి తనయుడిని కలుసుకున్నాడట.

సావిత్రికి సంబంధించిన కీలకమైన విషయాలను ఆయన నుంచి నాగ్ అశ్విన్ సేకరించాడు. సావిత్రి తనయుడు ఇచ్చిన సమాచారం ఈ సినిమాకి ఎంతగానో ఉపయోగపడుతోందని అంటున్నారు. కొన్ని రోజులుగా 'అంతర్వేది'లో షూటింగ్ జరిపిన ఈ సినిమా టీమ్, ప్రస్తుతం 'పాలకొల్లు' చేరుకుంది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. సమంతా .. దుల్కర్ సల్మాన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.       
keerti suresh

More Telugu News