అందుకే చైతూ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే చైతూ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట!

'యుద్ధం శరణం' సినిమా తరువాత చందూ మొండేటితో కలిసి నాగచైతన్య సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. ఆ తరువాత మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి వుంది. కానీ ముందుగా మారుతి సినిమా చేయాలనీ, ఆ తరువాతనే చందూ మొండేటితో 'సవ్యసాచి' చేయాలని చైతూ భావిస్తున్నాడు.

ముందుగా తీసుకున్న తన నిర్ణయాన్ని ఆయన మార్చుకోవడానికి కారణం, 'యుద్ధం శరణం' సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోవడమే. యాక్షన్ తో కూడిన సినిమాలు తనకి పెద్దగా కలిసి రావని మరోసారి స్పష్టం కావడంతోనే చైతూ .. మారుతి ప్రాజెక్టును ముందుకు తెచ్చాడని అంటున్నారు. ముందుగా మారుతితో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి .. ఆ తరువాత చందూ చెప్పిన యాక్షన్ స్టోరీ గురించి ఆలోచించాలనే నిర్ణయానికి వచ్చాడని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్ పేరు వినిపిస్తోంది.   
chaitu
megha akash

More Telugu News