కొత్త లుక్ తో నిఖిల్ రంగంలోకి దిగిపోయాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త లుక్ తో నిఖిల్ రంగంలోకి దిగిపోయాడు!

వరుస సక్సెస్ లను అందుకుంటూ వెళుతోన్న నిఖిల్ .. కొంత గ్యాప్ ఇచ్చాడు. అది కూడా తన తదుపరి సినిమాకి అవసరమైన లుక్ కోసమే. 'కేశవ' సినిమా సక్సెస్ తరువాత కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' తెలుగు రీమేక్ చేయడానికి నిఖిల్ అంగీకరించాడు. క్రితం ఏడాది కన్నడలో విడుదలైన ఈ సినిమా, అక్కడ భారీ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

 ఈ సినిమా కోసం నిఖిల్ కండలు .. మీసాలు .. గెడ్డం పెంచేశాడు. ఆ లుక్ తోనే ఈ రోజున ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. శరణ్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నిఖిల్ తో గల పరిచయం కారణంగా దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకి సంభాషణలు సమకూర్చగా, మరో దర్శకుడు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం వుంటుందట. త్వరలోనే వాళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది.  
nikhil

More Telugu News