రాజ్ తరుణ్ ను 'రాజుగాడు' కాపాడేస్తాడా?
ఇక తాజా చిత్రం 'రాజుగాడు'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రాజ్ తరుణ్ రెడీ అవుతున్నాడు. సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మిగతా చిత్రీకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అక్టోబర్లో గానీ .. నవంబర్లో గాని ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ కి సరైన హిట్ ఇస్తుందేమో చూడాలి.