హరీశ్ శంకర్ 'దాగుడుమూతలు'కు నో చెబుతోన్న యంగ్ హీరోలు!
ఈ సినిమాను సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ లతో హరీశ్ శంకర్ తెరకెక్కించాలనుకున్నాడు. ఈ ఇద్దరి డేట్స్ అందుబాటులో లేకపోవడంతో, నాని - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో చేయాలనుకున్నాడు. అందుకోసం వాళ్లను సంప్రదించగా .. తమ కాంబినేషన్ ఎంత మాత్రం వర్కౌట్ కాదని తేల్చేశారట. తాను అనుకున్న యువ హీరోలు ఎంత మాత్రం ఆసక్తి కనబరచక పోవడంతో, హరీశ్ శంకర్ నిరాశకి లోనయ్యాడట. ఇక ఈ కథను ఆయన పక్కన పెట్టేస్తాడా? వేరే హీరోలను లైన్లో పెడతాడా? అనేది చూడాలి.