రవితేజతో శ్రీను వైట్ల మూవీ ఖాయమైనట్టే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజతో శ్రీను వైట్ల మూవీ ఖాయమైనట్టే!

కొంతకాలం క్రితం వరకూ హీరోగా వరుస హిట్లతో రవితేజ .. దర్శకుడిగా వరుస హిట్లతో శ్రీను వైట్ల దూసుకుపోయారు. ఆ తరువాత ఈ ఇద్దరికి సక్సెస్ ముఖం చాటేసింది. సరైన హిట్ కోసం ఇద్దరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. గతంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన 'నీ కోసం' .. 'వెంకీ' .. 'దుబాయ్ శీను' హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయాయి.

దాంతో మరోసారి కలిసి సినిమా చేయడానికి రంగంలోకి దిగారు. నిర్మాణ సంబంధమైన విషయంలో ఈ ఇద్దరూ ఆలోచనలో పడగా, తాము నిర్మిస్తామంటూ మైత్రీ మూవీస్ వారు ముందుకొచ్చారట. అయితే సాధ్యమైనంత తక్కువ బడ్జెట్ లోనే సినిమా చేసేయాలనీ, పారితోషికం కాకుండా లాభాల్లో వాటాలు తీసుకోమని షరతు పెట్టారని వినికిడి. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేయబోతోందన్న మాట.        
raviteja

More Telugu News