విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ హీరోయిన్ రష్మిక మందన!
Add ap7am to your home Screen

విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ హీరోయిన్ రష్మిక మందన!

గీతా ఆర్ట్స్ బ్యానర్లో పరశురామ్ గతంలో 'శ్రీరస్తు శుభమస్తు' అనే సినిమాను తెరకెక్కించాడు. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా విజయాన్ని సాధించింది. దాంతో ఇదే బ్యానర్లో మరో సినిమా చేసే ఛాన్స్ ఆయనకి దక్కింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఆయన ఈ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఆయన కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నాడు.

అయితే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ సినిమా యూనిట్ కథానాయికగా కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి కన్నడ హీరోయిన్ 'రష్మిక మందన'ను తీసుకున్నట్టు తెలుస్తోంది. కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' హిట్ తో రష్మిక మందన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాతో తెలుగులో తన హవాకు ఆరంభం పలుకుతుందేమో చూడాలి.     
vijay devarakonda
rashmika

More Telugu News