rakul: రకుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టేలానే ఉందండోయ్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపైకి వస్తూనే అందం .. అభినయం కలగలిసిన కథానాయికగా రకుల్ మార్కులు కొట్టేసింది. యూత్ లో ఆమెకి ఏర్పడిన క్రేజ్ .. అగ్రకథానాయకుల సరసన అవకాశాలను కల్పిస్తోంది. కథల ఎంపికలో ఆమె తీసుకుంటోన్న జాగ్రత్తలు వరుస విజయాలను తెచ్చిపెడుతున్నాయి.

 ఈ ఏడాదిలో నాగచైతన్య సరసన ఆమె చేసిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా భారీ విజయాన్నే అందుకుంది. ఈ సినిమాలో గ్లామర్ పరంగా రకుల్ చేసిన సందడి అభిమానులను మురిపించింది. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఆమె చేసిన 'జయ జానకి నాయక' కూడా ఆడియన్స్ ను అలరిస్తూ సక్సెస్ ను అందుకుంది. ఇక మహేశ్ బాబుతో చేసిన 'స్పైడర్' సెప్టెంబర్ 27న విడుదలకి ముస్తాబవుతోంది. ఈ సినిమాతో రకుల్ కి హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో సందేహం లేదనేది ఆమె అభిమానుల మాట.   
Go Back to Shorts
rakul

More Telugu News