'అర్జున్ రెడ్డి' రీమేక్ లో చేయడానికి తమిళ హీరోల పోటీ!
Add ap7am to your home Screen

'అర్జున్ రెడ్డి' రీమేక్ లో చేయడానికి తమిళ హీరోల పోటీ!

ఇప్పుడు కుర్రకారంతా కూడా 'అర్జున్ రెడ్డి' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. అంతగా ఈ సినిమా వాళ్లను ప్రభావితం చేస్తోంది. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమా విజయ విహారాన్ని కొనసాగిస్తోంది. భారీ వసూళ్లను రాబడుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. దాంతో తమిళ యువ హీరోలు ఈ సినిమాపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.

 తమిళంలో ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం అక్కడి నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే, తమిళ యువ హీరోలు ఆ రీమేక్ లో తాము చేస్తామంటూ ఎవరికి వారు పోటీ పడుతున్నారట. తెలుగులో ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఎంతటి క్రేజ్ ను తెచ్చిందనేది తెలిసిందే. అదే స్థాయి క్రేజ్ ను సొంతం చేసుకోవడానికి తమిళ యువ హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారట. మరి ఈ రీమేక్ ఛాన్స్ ఎవరిని వెతుక్కుంటూ వెళుతుందో చూడాలి.    
vijay devarakonda
shalini pande

More Telugu News