nani: నిర్మాతగా నాని నుంచి మరో సినిమా!

షార్ట్స్‌లో చూడండి
చిన్న సినిమాలతో తన నట ప్రయాణాన్ని మొదలుపెట్టిన నాని, అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. కథానాయకుడిగా ఆయన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతగానూ రాణించాలనేది ఆయన కోరిక. ఈ కారణంగానే గతంలో 'డి ఫర్ దోపిడి' అనే సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు. మరోసారి నిర్మాతగా ట్రై చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడనేది తాజా సమాచారం.

 నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ వినిపించిన కథ నచ్చడంతో, నిర్మాతగా నాని ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. కథకి అవసరమైన నటీనటులతో ఆయన మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కొంతమందిని ఒప్పించినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై నాని క్లారిటీ ఇవ్వాల్సి వుంది. ప్రస్తుతం ఆయన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
nani

More Telugu News