స్టార్ హీరో జోడీగా సాయేషా సైగల్
Add ap7am to your home Screen

స్టార్ హీరో జోడీగా సాయేషా సైగల్

తెలుగు తెరకి 'అఖిల్' సినిమాతో పరిచయమైన సాయేషా సైగల్ .. గ్లామర్ పరంగా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా పరాజయంపాలు కావడం వలన, ఆ తరువాత ఆమెకి ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో ఆమె కోలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఆల్రెడీ 'వనమాగన్' చేసిన సాయేషా సైగల్ .. రీసెంట్ గా విశాల్ - కార్తీ సినిమాను కూడా అంగీకరించింది.

 తాజాగా ఆమె విజయ్ సేతుపతి సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. 'విక్రమ్ వేదా' సినిమాతో మరింత క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ సేతుపతి,  గోకుల్ దర్శకత్వంలో 'జుంగా' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సాయేషా సైగల్ ను తీసుకున్నారు. ఈ సినిమా షూటింగులో ఎక్కువ భాగాన్ని పారిస్ లో ప్లాన్ చేసినట్టు సమాచారం.     
vijay setupathi
sayesha

More Telugu News