తెలుగు రాష్ట్రాల్లో 'అర్జున్ రెడ్డి' తొలిరోజు వసూళ్లు!
Add ap7am to your home Screen

తెలుగు రాష్ట్రాల్లో 'అర్జున్ రెడ్డి' తొలిరోజు వసూళ్లు!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'అర్జున్ రెడ్డి' .. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాలిని పాండే కథానాయికగా నటించిన ఈ సినిమా, తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది.

 నైజామ్ లో 1.22 కోట్లు .. సీడెడ్ లో 33 లక్షలు .. ఉత్తరాంధ్రలో 21 లక్షలు .. ఈస్ట్ గోదావరిలో 12 లక్షలు .. వెస్ట్ గోదావరిలో 9 లక్షలు .. కృష్ణాలో 25 లక్షలు .. గుంటూరులో 20 లక్షలు .. నెల్లూరులో 5 లక్షలను రాబట్టింది. ఇలా ఈ సినిమా తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 47 లక్షలను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కెరియర్లో మరో హిట్ నమోదైనట్టేననే టాక్ వినిపిస్తోంది.    
vijay devarakonda
shalini pande

More Telugu News