vijay devarakonda: స్టార్ హీరోలు రంగంలో వున్నా 'అర్జున్ రెడ్డి'కి పెద్దగా పోటీ లేనట్టే!

షార్ట్స్‌లో చూడండి
ఈ శుక్రవారం మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అజిత్ తమిళంలో చేసిన 'వివేగం' .. 'వివేకం' పేరుతో ఈ నెల 24వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ మరుసటి రోజున ధనుష్ 'విఐపి 2' .. ' అర్జున్ రెడ్డి' విడుదలవుతున్నాయి. అజిత్ తమిళంలో స్టార్ హీరో అయినా ఆయన సినిమాలకి తెలుగులో పెద్దగా క్రేజ్ లేదు. తెలుగులో ఆయన సినిమాలు వసూళ్ల వర్షం కురిపించిన సందర్భాలు చాలా తక్కువ.

ఇక ధనుష్ విషయానికి వస్తే .. ఆల్రెడీ 'విఐపి 2' తమిళంలో రిలీజ్ అయింది. అక్కడ ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. అలాంటప్పుడు తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ప్రభావితం చేసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. అందువలన ఈ రెండు సినిమాలు 'అర్జున్ రెడ్డి'కి పెద్ద పోటీ కాదనే చెప్పాలి. యూత్ ఈ సినిమాపైనే దృష్టి పెట్టిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. 
Go Back to Shorts
vijay devarakonda

More Telugu News