సినిమా కబుర్లు .. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు .. సంక్షిప్త సమాచారం

*  'నా కెరీర్ ప్రారంభంలో నేను పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు..' అంటోంది బ్యూటీ క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్. "మొదట్లో చాలా కష్టాలు పడ్డాను. వివిధ కారణాల వల్ల పది నెలల్లో మూడు సినిమాల నుంచి తప్పుకోవలసి వచ్చింది. అప్పుడు పిచ్చెక్కిపోయేది. అసలు ఆ కష్టాలే ఆ తర్వాత నాకు బలాన్నిచ్చాయి. నిలదొక్కుకోగలగడానికి మార్గాన్ని చూపాయి" అని చెప్పింది.          
*  నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో పూర్తయింది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
*  సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా రూపొందిన 'వీడెవడు' చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. తాతినేని సత్య దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  
*  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రం హీరోగా రూపొందుతున్న 'ధ్రువ నచ్చత్రం' తమిళ చిత్రం షూటింగ్ టర్కీలో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత యూనిట్ తదుపరి షూటింగ్ కోసం అబూ ధాబి వెళుతుంది.
Rakul
vikram

More Telugu News