కీర్తి సురేశ్ కల నిజమయ్యేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కీర్తి సురేశ్ కల నిజమయ్యేనా?

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది. అనతికాలంలోనే ఆమె అగ్రకథానాయకుల సరసన చోటు సంపాదించుకుంటోంది. తమిళంలో సూర్య .. విజయ్ .. ధనుశ్ .. వంటి స్టార్ హీరోల జోడీకట్టిన ఆమె, తెలుగులో పవన్ కల్యాణ్ సరసన చేస్తుండటం విశేషం.

అలాంటి కీర్తి సురేశ్ .. అజిత్ సరసన నటించే ఛాన్స్ ఇంకా రాలేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. హీరో అజిత్ అంటే తనకి ఎంతో ఇష్టమనీ .. ఆయన సినిమాలను తప్పకుండా చూసేదానినని చెప్పింది. ఆయన జోడీగా నటించాలని ఉందని అంది. అయితే ఆ దిశగా తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనీ, త్వరలోనే అజిత్ మూవీలో చేస్తానని నమ్మకం ఉందని చెప్పింది. తమిళంలో కీర్తి సురేశ్ కి పెరుగుతోన్న క్రేజ్ చూస్తుంటే, త్వరలోనే ఆమె కల నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. 
keerti suresh

More Telugu News