నిఖిల్ తో 'పెళ్లిచూపులు' డైరెక్టర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిఖిల్ తో 'పెళ్లిచూపులు' డైరెక్టర్!

'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కి నూటికి నూరు మార్కులు పడిపోయాయి. ఈ సినిమాతో ఆయన కేవలం సక్సెస్ ను మాత్రమే అందుకోవడం కాదు, సరికొత్త ట్రెండ్ ను సృష్టించాడు. దాంతో పెద్దగా గ్యాప్ లేకుండా ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ వెళతాడని అనుకున్నారు. కానీ మరో కథను సిద్ధం చేసుకోవడానికే ఆయన ఎక్కువ సమయం తీసుకున్నాడు.

ఈ కథపై బాగా కసరత్తు చేసి .. నిఖిల్ తో చేస్తే బాగుంటుందని భావించాడట. ఆ కథ వినగానే తనకి నచ్చేసిందని చెప్పిన నిఖిల్, తప్పకుండా చేద్దామని అన్నట్టు సమాచారం. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' రీమేక్ లో చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత, ఒక వైపున 'కార్తికేయ' సీక్వెల్ చేస్తూనే, మరో వైపున తరుణ్ భాస్కర్ మూవీ చేస్తాడట.  
nikhil

More Telugu News