100 కోట్ల క్లబ్ లో చేరానంటోన్న కమలహాసన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

100 కోట్ల క్లబ్ లో చేరానంటోన్న కమలహాసన్!

కథానాయకుడిగా .. దర్శక నిర్మాతగా .. రచయితగా ఇలా అనేక విషయాల్లో తన సత్తా చాటుకున్న కమలహాసన్, బుల్లితెర ప్రేక్షకుల కోసం 'బిగ్ బాస్' చేస్తున్నారు. ఇటీవల ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ సెలబ్రిటీ .. మురికివాడల్లో నివసించే వారి గురించి తప్పుగా మాట్లాడటం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై స్పందించిన 'పుతియ తమిళగం' అధ్యక్షుడు కె. కృష్ణస్వామి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న కమల్ పై 100 కోట్లకి పరువు నష్టం దావా వేశారు.

ఈ విషయంపై కమల్ ప్రతిస్పందిస్తూ .. తాను కూడా 100 కోట్ల క్లబ్ లో చేరానంటూ చమత్కరించారు. ఏ భారతీయ నటుడు ఈ క్లబ్ లో చేరడానికి సాహసం చేయడనీ .. తనకి మాత్రమే ఆ అవకాశం దక్కిందని ఆయన అన్నారు. ఇప్పుడు తనపై పరువు నష్టం దావా వేసిన వ్యక్తి .. గతంలో 'సందియర్' టైటిల్ విషయంలోను కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, తాను డబ్బు కట్టడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. 
kamal

More Telugu News