న్యూ మూవీ కోసం లొకేషన్ల వేటలో హరీశ్ శంకర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూ మూవీ కోసం లొకేషన్ల వేటలో హరీశ్ శంకర్!

మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడమెలాగో హరీశ్ శంకర్ కి బాగా తెలుసు. అదే విషయాన్ని ఆయన ' దువ్వాడ జగన్నాథం' సినిమాతో మరో మారు నిరూపించాడు. అయితే అల్లు అర్జున్ క్రేజ్ కి తగినట్టుగా ఆ సినిమా లేదనే విమర్శలు బాగానే వినిపించాయి. ఈ విషయాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా, తన తదుపరి సినిమాకి సంబంధించిన పనుల్లో పడిపోయినట్టు తెలుస్తోంది.

 తన తదుపరి సినిమా కాన్సెప్ట్ బేస్డ్ గా ఉంటుందని కొన్ని రోజుల క్రితమే చెప్పిన హరీశ్ శంకర్, లొకేషన్ల వేటలో పడినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చెబుతూ, వాషింగ్టన్ డీసీ .. న్యూయార్క్ నగరాల్లో దిగిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీనిని బట్టి ఆయన నెక్స్ట్ మూవీ యూఎస్ నేపథ్యంలో కొనసాగేదై ఉండొచ్చని చెప్పుకుంటున్నారు.  
harish shankar

More Telugu News