'అర్జున్ రెడ్డి'కి విపరీతమైన కోపమట!
Add ap7am to your home Screen

'అర్జున్ రెడ్డి'కి విపరీతమైన కోపమట!

'ద్వారక' సినిమా ఫ్లాప్ కావడంతో కథల ఎంపిక విషయంలో విజయ్ దేవరకొండ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అలా ఆయన సందీప్ రెడ్డి వంగా వినిపించిన 'అర్జున్ రెడ్డి' కథతో సెట్స్ పైకి వెళ్లాడు. విభిన్నమైన కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా, షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్  ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

 ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డాక్టర్ గా కనిపిస్తాడట. అయితే ఉన్నట్టుండి ఆయనకి విపరీతమైన కోపం వస్తుంటుంది .. అదే ఆయన బలహీనత. ఆ కారణంగా ఆయన అనేక సమస్యలను ఎదుర్కుంటూ ఉంటాడు. ఆయన మానసిక స్థితి అలా ఉండటానికి కారణం ఏమిటనేదే సస్పెన్స్. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చి పెడుతుందనే నమ్మకంతో విజయ్ దేవరకొండ వున్నాడు.  
vijay devarakonda

More Telugu News