నిఖిల్ తోనే మూడు సినిమాలు చేసే ఆలోచనలో పెద్ద బ్యానర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిఖిల్ తోనే మూడు సినిమాలు చేసే ఆలోచనలో పెద్ద బ్యానర్!

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ కథానాయకులలో నిఖిల్ కూడా ముందు వరుసలోనే కనిపిస్తాడు. అలాంటి నిఖిల్ తో వరుసగా మూడు సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు వున్నారు.

ఇంతకు ముందు ఈ బ్యానర్ వారు రాజ్ తరుణ్ తో వరుసగా మూడు సినిమాలు చేశారు. అలాగే నిఖిల్ తో చేయాలనుకుంటున్నారు. తాజాగా నిఖిల్ తో ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన ఈ బ్యానర్ వారు .. మూడు సినిమాల అగ్రిమెంట్ విషయాన్ని ఆయన ముందుంచారట. ఒకేసారి భారీ మొత్తాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆయన ఇంకా ఎటూ తేల్చుకోలేదట. ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.    
nikhil

More Telugu News