సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  తమిళ స్టార్ హీరో అజిత్ సరసన నాయికగా నటించే ఛాన్స్ మళ్లీ శ్రుతి హాసన్ కు వచ్చింది. శివ దర్శకత్వంలో అజిత్ తన 58వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో కథానాయిక పాత్ర కోసం శ్రుతిని సంప్రదిస్తున్నట్టు సమాచారం. గతంలో అజిత్, శ్రుతి కలసి 'వేదాళం' చిత్రంలో నటించారు.  
*  హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న 'దర్శకుడు' చిత్రం ఆడియో వేడుకను నిన్న రాత్రి హైదరాబాదులో నిర్వహించారు. తొలిసీడీని దర్శకుడు సుకుమార్ విడుదల చేయగా, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి కలసి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యాడు.  
*  సొట్టబుగ్గల చిన్నది తాప్సీ చాలా కాలం తర్వాత తెలుగులో నటించిన చిత్రం 'ఆనందో బ్రహ్మ'. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 19న విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.
*  కమలహాసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రం ఆమధ్య కొంత షూటింగ్ జరుపుకుని ఆగిపోయిన సంగతి విదితమే. తిరిగి త్వరలోనే ఈ చిత్రం షూటింగును ప్రారంభించడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కమల్, శ్రుతి హాసన్ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు.  
Kamal
Shruti

More Telugu News