కాలేజ్ స్టూడెంట్ గా వస్తోన్న నిఖిల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలేజ్ స్టూడెంట్ గా వస్తోన్న నిఖిల్!

టాలీవుడ్ యువ కథానాయకులలో నాని .. శర్వానంద్ తరువాత కొత్తదనం కలిగిన కథలను ఎంచుకునే హీరోగా నిఖిల్ కనిపిస్తాడు. నిఖిల్ చిన్నవాడే అయినా .. ఆయన కథా బలాన్ని నమ్ముతాడు. అందువలన ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తుంటాడు .. ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతుంటాడు.

 అలా ఈ సారి కూడా ఆయన ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను  కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో చేద్దామనుకున్నా, ఆ తరువాత మరో కొత్త కుర్రాడికి ఛాన్స్ ఇచ్చాడట. ఆ కుర్రాడికి చందూ మొండేటి .. సుధీర్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం వుంది. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ఈ కథలో నిఖిల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తాడట. కాన్సెప్ట్ కొత్తగా ఉండటం వల్లనే నిఖిల్ ఈ సినిమాను ఓకే చేశాడని చెప్పుకుంటున్నారు.    
nikhil

More Telugu News