పవన్ మూవీలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ మూవీలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్!

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మళ్లీ నటించాలని ఆయన అభిమానులంతా కోరుకున్నారు. వాళ్ల కోరిక మేరకే ప్లాన్ చేసిన పవన్ .. త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో లవ్ .. రొమాన్స్ .. సెంటిమెంట్ .. కామెడీతో పాటు యాక్షన్ కి కూడా త్రివిక్రమ్ పెద్ద పీట వేశాడట.

 ఈ సినిమాలో పవన్ కోసం ఆయన మూడు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ యాక్షన్ దృశ్యాలు ఒక రేంజ్ లో వుంటాయట. పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు వచ్చే సినిమా కనుక, ఆ దిశగా కూడా ఫ్యాన్స్ కి పూర్తి స్థాయి సంతృప్తిని కలిగించే విధంగా ఆయన ఈ సినిమా విషయంలో కేర్ తీసుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాతో ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని చెప్పుకుంటున్నారు. పవన్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్.. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.      
pavan
keerti suresh

More Telugu News