న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆన్‌లైన్ షాపింగ్ సైట్ మింత్రా
మింత్రా సైటు యజమాన్య సంస్థ అయిన ఫ్లిప్కార్ట్కు ఈ ఆఫర్ లాభాలను తెచ్చిపెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నవంబరు 8 తరువాత ఫ్లిప్కార్ట్ వృద్ధి రేటు 50 శాతం మేర పడిపోయింది. తమ సంస్థ సాధారణ రోజుల కంటే ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ ఈవెంట్లో తమ విక్రయాలను ఎన్నో రెట్లు అధికం చేసుకుంటామని, ఈ ఈవెంట్‌ను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామని మింత్రా సీఈవో ఆనంత్ నారయణన్ చెప్పారు. ఈ ఏడాది జులైలోనూ ఈవెంట్‌ను నిర్వహించామని, అయితే, ఇప్పుడు దానికంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తామని అన్నారు. ఈ ఈవెంట్ లో 15 మిలియన్ ప్రజలు కొనుగోళ్లు చేస్తారని, 5 నుంచి 6 లక్షల మధ్య కొత్త కస్టమర్లను పొందుతామని ఆయన పేర్కొన్నారు.